ప్రతిరోజూ అందాల జాతర చేసే హీరోయి న్లలో వేదిక ఒకరు. కుదిరితే ఫోటో షూట్.. కుదరకపోతే త్రో బ్యాక్ పేరిట హీటెక్కించే ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తుంటుంది. తాజాగా అదిరిపోయే పిక్ ఒకటి తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. గ్రీన్ టాప్, బ్లూ జీన్స్ బ్యాక్ గ్రౌండ్ లో గ్రీన్ అందాల మధ్య సిమ్ లుక్ లో మెరిసింది. పర్ఫెక్ట్ కొలతలతో ఆకట్టుకుంటోంది. విజయద శమి సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది వేదిక. ఆ తర్వాత బాణం, దగ్గరగా.. దూరంగా, రూలర్ సినిమాల్లో నటించింది. కాంచన 3 లోనూ కనిపిం చింది. ప్రస్తుతం ఐదు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. వీటిలో 'జింగిల్' ద్విభాషా (తెలుగు, తమిళ్) చిత్రం ఒకటి.