వలయం సినిమాతో కమర్షియల్ హిట్ కొట్టిన యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో లక్ష్ తన తదుపరి ప్రాజెక్ట్ ని డైరెక్టర్ ఈషాన్ సూర్యతో ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'గ్యాంగ్‌స్టర్ గంగరాజు' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. 'గ్యాంగ్‌స్టర్ గంగరాజు' జూన్ 24న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుంది. తాజా అప్‌డేట్ ప్రకారం, ఈ సినిమా 2 గంటల 12 నిమిషాల రన్‌టైమ్ ను కలిగి ఉంది అని మూవీ మేకర్స్ వెల్లడించారు. ఈ సినిమాలో లక్ష్ చదలవాడ సరసన వేదిక దత్ జంటగా నటిస్తుంది. వెన్నెల కిషోర్, చరణ్ దీప్, శ్రీకాంత్ అయ్యంగర్, గోపరాజు రమణ, నిహార్ కపూర్, రాజేశ్వరి నాయర్, సత్యక్రిషన్, రవితేజ నన్నిమల, సమ్మెట గాంధీ, రాజేంద్ర, అను మానస, లావణ్య రెడ్డి, అన్నపూర్ణ, తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రముఖ నిర్మాత పద్మావతి చదలవాడ శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిల్మ్స్ బ్యానర్‌పై చదలవాడ బ్రదర్స్ సమర్పణలో నిర్మించారు.