శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో టాలెంటెడ్ హీరో అడివి శేష్ నటించిన "మేజర్" సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని అందుకొని సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. తాజా ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా నార్త్ బాక్స్ఆఫీస్ వద్ద 11 కోట్ల మార్కును క్రాస్ చేసినట్లు సమాచారం. ఈ చిత్రంలో శోభితా ధూళిపాళ, సాయి మంజ్రేకర్, ప్రకాష్ రాజ్, రేవతి సహాయక పాత్రల్లో కనిపించనున్నారు. "మేజర్" చిత్రం భారతదేశంలోని ముంబైలో 26-11 మధ్య జరిగిన ఘోరమైన ఉగ్రవాద దాడులలో వీరమరణం పొందిన సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత ప్రయాణం ఆధారంగా రూపొందించబడింది. ఈ సినిమాకి GMB ఎంటర్టైన్మెంట్స్, సోనీ పిక్చర్స్ ఇండియా మరియు AplusS మూవీస్ బ్యానర్లు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు.