సిద్ధార్థ్ సేన్‌గుప్తా డైరెక్షన్ లో బాలీవుడ్ బ్యూటీ క్వీన్ జాన్వీ కపూర్ ఒక సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసందే. ఈ సినిమాకి 'గుడ్ లక్ జెర్రీ' అనే టైటిల్ ని మేకర్స్ లాక్ చేసారు. ఈ చిత్రం లేడీ సూపర్ స్టార్ నయనతార తమిళ చిత్రం కొలమావు కోకిల (2018)కి అధికారిక రీమేక్. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా భారతదేశంలోని ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్ అయిన డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో జూలై 29 నుంచి ప్రసారం కానుంది అని మేకర్స్ వెల్లడించారు. పంకజ్ మట్టా రచించిన ఈ మూవీలో దీపక్ డోబ్రియాల్, మీటా వశిష్ఠ, నీరజ్ సూద్ మరియు సుశాంత్ సింగ్ కీలక పాత్రలు పోషించారు. బ్లాక్ కామెడీ క్రైమ్ మూవీగా రానున్న గుడ్ లక్ జెర్రీ సినిమాని ఆనంద్ ఎల్ రాయ్ కలర్ ఎల్లో ప్రొడక్షన్స్, లైకా ప్రొడక్షన్స్ అండ్ సన్‌డియల్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించాయి.