టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయికుమార్, 'RX100' ఫేమ్ పాయల్ రాజ్ పుత్ జంటగా నటిస్తున్న చిత్రం తీస్ మార్ ఖాన్. కళ్యాన్ జి గొనగా డైరెక్షన్లో పక్కా యాక్షన్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాను నగం తిరుపతి రెడ్డి నిర్మిస్తున్నారు.
తాజాగా ఈ మూవీ నుండి మేకర్స్ కొంచెంసేపటి క్రితమే టీజర్ ను రిలీజ్ చేసారు. నగరంలో జరుగుతున్న కొన్ని అనుకోని సంఘటనల గురించి, వాటిని చేస్తున్న ఆగంతకులను పట్టుకోవాలని కొంతమంది పోలీసులు డిస్కస్ చేస్తుంటారు. వారివల్ల కాకపోవడంతో రంగంలోకి ఆదిని దింపుతారు. బిహేవియర్ లో ,యాటిట్యూడ్ లో విభిన్నంగా ఉండే పోలీసాఫీసర్ గా ఆది నటన అద్భుతంగా ఉంది. స్టూడెంట్ గా, పోలీసుగా, రౌడీగా మూడు విభిన్న పార్శ్వాలలో ఆది ఈ సినిమాలో నటిస్తున్నట్టు తెలుస్తుంది. అతని లవర్ గా పాయల్ ఓకే అనిపించింది. ఆమె పాత్రకు పెద్దగా స్కోప్ లేకపోయినా, గ్లామర్ తో సినిమాకు అదనపు ఆకర్షణగా నిలవనుంది. టీజర్ తో సినిమాపై మంచి అంచనాలను క్రియేట్ చేసిన మేకర్స్ త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామని చెప్పారు. ఈ సినిమా ఐనా ఆదిని సక్సెస్ ట్రాక్ లోకి తీసుకొస్తుందేమో చూడాలి.