సూపర్ స్టార్ రజినీకాంత్ స్టైల్ కు ఒక్క భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. చాలామంది ఆయన స్టైల్ ను అనుకరిస్తుంటారు కూడా. వారికి నేనేమి తక్కువ కాదు అన్నట్టుగా.. మెగాస్టార్ చిరు కూడా రజిని స్టైల్ ను ఇమిటేట్ చేసి, ప్రేక్షకుల చేత ఔరా! అనిపించారు.
తెలుగు ఓటిటి 'ఆహా' లో ప్రసారమవుతున్న పాపులర్ సింగింగ్ షో 'తెలుగు ఇండియన్ ఐడల్' గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కు మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా హాజరై, విన్నర్ ను ప్రకటించారు. ఒక సింగర్ పాటను పాడిన తర్వాత మెగాస్టార్ అకస్మాత్తుగా కుర్చీలో నుండి స్టేజిపైకి వచ్చారు. అదికూడా రజిని స్టైల్ లో. దీంతో అక్కడున్న ప్రతిఒక్కరూ ఆశ్చర్యచకితులయ్యారు. చిరు ను ప్రశంసించారు. ఈ వీడియో క్లిప్ ను ఆహా ఓటిటి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో, ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది.