పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న మరో పాన్ ఇండియా చిత్రం సలార్. కేజీఎఫ్ తర్వాత ప్రశాంత్ నీల్ నుండి రాబోతున్న మరో ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్టైనర్. ఇందులో శృతి హాసన్ కథానాయిక. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ్ కిరంగదుర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రవి బస్రుర్ సంగీతం అందిస్తున్నారు. 30శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ చాలా లాంగ్ బ్రేక్ తర్వాత ఇటీవలే కొత్త షెడ్యూల్ ను ప్రారంభించింది.
ఈ మూవీ కోసం వేకళ్ళతో ఎదురుచూస్తున్న అభిమానులకు ఒక శుభవార్త. త్వరలోనే ఈ మూవీ నుండి టీజర్ రిలీజ్ కాబోతుందట. ఈ టీజర్ కేవలం ప్రభాస్ లుక్స్, ఆయన చేసే హై ఇంటెన్స్ మాస్ యాక్షన్ ఎపిసోడ్స్ గురించే ఉంటుందట. యాక్షన్ సీన్లను తెరకెక్కించడంలో ప్రశాంత్ నీల్ కెపాసిటీని కేజీఎఫ్ 1,2 మూవీస్ లోనే మనం చూసేసాం. ఇలాంటి మాస్టర్ యాక్షన్ కింగ్ మేకర్ కు ప్రభాస్ లాంటి కటౌట్ జత కుదిరితే వెండితెరపై ఆవిష్కృతమయ్యే అద్భుతానికి చిన్న శాంపిల్ గా టీజర్ ఉండనుందని టాక్. అయితే, ఈ మాసివ్ ట్రీట్ టీజర్ ప్రేక్షకుల ముందుకు రావడానికి మరికొంత సమయం పట్టేటట్లుంది.