తెలుగు మొట్టమొదటి ఓటిటి సంస్థ 'ఆహా' తెరకెక్కించిన టాక్ షో "అన్ స్టాపబుల్". నందమూరి నటసింహం బాలకృష్ణ గారు హోస్ట్ చేసిన ఈ షో అత్యధిక వ్యూలు సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. బాలయ్యబాబు వాక్చాతుర్యం, షోకు విచ్చేసిన ప్రముఖ సెలెబ్రిటీల కారణంగా ఈ షో అత్యధిక వ్యూయర్ షిప్ సాధించి, IMDB రేటింగ్స్ లో స్థానం సంపాదించుకుంది.
గ్రాండ్ సక్సెస్ అయిన ఈ షోకు సెకండ్ సీజన్ కూడా ఉంటుందని బాలయ్య తో పాటు షో నిర్వాహకులు కూడా ఇదివరకే అధికారికంగా ప్రకటించారు. తాజాగా అన్ స్టాపబుల్ సీజన్ 2 పై బాలయ్య కంఫర్మేషన్ ఇచ్చారు. ఇటీవల ఆహాలో బాగా పాపులరైన తెలుగు ఇండియన్ ఐడల్ షోకు హాజరైన బాలయ్య అన్ స్టాపబుల్ 2 పై క్లారిటీ ఇస్తూ మధురక్షణాలకు ముగింపు ఉండదు... కొనసాగింపే అని చెప్పారు. ఈ వీడియో క్లిప్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన మేకర్స్ అన్ స్టాపబుల్ సీజన్ 2 కు సంబంధించిన బిగ్ అప్డేట్ ను ఆగస్టు 15వ తేదీన అధికారికంగా ప్రకటించనున్నట్టు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa