పరశురామ్ పెట్ల దర్శకత్వంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'సర్కారు వారి పాట' సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ జంటగా నటిస్తుంది. సుబ్బరాజు, వెన్నెల కిషోర్ తదితరులు ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని ప్రముఖ OTT ప్లాటుఫార్మ్ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇప్పుడు ప్రసారానికి అందుబాటులో ఉంది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా ప్రైమ్ వీడియోలో ఈరోజు నుండి సబ్‌స్క్రైబర్లందరికీ అదనపు ఖర్చు లేకుండా స్ట్రీమింగ్ కోసం అందుబాటులో కి వచ్చింది. GMB ఎంటర్‌టైన్‌మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ మరియు 14 రీల్స్ ప్లస్ ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. థమన్ స్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.
![]() |
![]() |