సుకుమార్ డైరెక్షన్లో అల్లు అర్జున్ నటించిన "పుష్ప" దేశవ్యాప్తంగా ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమా బన్నీకి పాన్ ఇండియా ఇమేజ్ ను గ్రాండ్ గా తీసుకొచ్చింది. దీంతో వెంటనే పుష్ప 2 పనులను స్టార్ట్ చేసేసారు బన్నీ, సుకుమార్ లు. పుష్ప 2 ప్రీ ప్రొడక్షన్ పనులను చక్కబెట్టడంలో సుకుమార్ బిజీగా ఉండగా, బన్నీ తన లుక్ అండ్ మ్యానరిజమ్స్ పై కసరత్తులు చేస్తున్నాడు. జూలై నుండి ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్తుందని చిత్రసీమలో వార్తలు వినబడుతున్నాయి. ఐతే, ఈ విషయం పై చిత్రబృందం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చెయ్యలేదు.
లేటెస్ట్ గా ఈ మూవీ రిలీజ్ డేట్ పై ఒక ఇంటరెస్టింగ్ న్యూస్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. అదేంటంటే, పుష్ప 2 రిలీజ్ ప్లాన్స్ ను మేకర్స్ మార్చేశారని, ఉన్న రెండు ఆప్షన్లలో ఒకటి 2023 చివర్లో ఐతే, రెండోదేమో 2024 ప్రారంభంలో అంట. ఈ వార్తలకు ప్రధాన కారణం పుష్ప 2 ఇంకా సెట్స్ పైకి వెళ్లకపోవడమే. ఈ వార్తతో బన్నీ పాన్ ఇండియా అభిమానులు నిరాశచెందుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa