పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉన్నారు. అయితే ప్రభాస్ హీరోగా, కేజీఎఫ్ సీరీస్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ తో భారీ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ ను చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం లో ప్రభాస్ మునుపెన్నడూ లేని విధంగా మాస్ గెటప్ లో కనిపిస్తున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన తాజా షెడ్యూల్ హైదరాబాద్ లో నేడు స్టార్ట్ అయినట్లు తెలుస్తుంది.హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ చిత్రం షూటింగ్ జరుగుతోంది. ఈ షూటింగ్ లో ప్రభాస్ మరియు హీరోయిన్ శృతి హాసన్ సెట్స్ జాయిన్ అయ్యారు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ఓ కీలక యాక్షన్ ఎపిసోడ్‌ని తెరకెక్కిస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని హోంబలే ఫిలింస్ భారీ ఎత్తున నిర్మిస్తోంది. ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీత దర్శకుడు గా వ్యవహరిస్తున్నారు.
![]() |
![]() |