పాత్ర నచ్చితే తాను మళ్ళీ విలన్ గా నటించడానికి సిద్ధమని టాలీవుడ్ హీరో గోపీచంద్ అన్నారు. తాజాగా ఆయన నటించిన పక్కా కమర్షియల్ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు. తన మొదటి సినిమా తర్వాత దర్శకుడు తేజ జయం సినిమా గురించి చెప్పారని, ఆ పాత్ర నచ్చి వెంటనే ఒప్పుకున్నన్నారు. ఆ తర్వాత వరుసగా వర్షం, నిజం లాంటి మంచి పాత్రలు వచ్చాయన్నారు. ఒక్కడు సినిమాలో ఓబుల్ రెడ్డి పాత్రకు కూడా తనను అడిగారన్నారు.