బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ తొలిసారి ఇండియన్ స్క్రీన్ పై కనిపించబోతున్న చిత్రం "లైగర్". పూరీజగన్నాధ్ డైరెక్షన్లో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ, అనన్యా పాండే హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. పూరి కనెక్ట్స్ తో కలిసి బాలీవుడ్ ప్రఖ్యాత నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్టుతో నిర్మించింది.
ఈరోజు మైక్ టైసన్ పుట్టినరోజు. దీంతో లైగర్ మూవీ టీం టైసన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ సర్ప్రైజింగ్ వీడియోను విడుదల చేసింది. ఇందులో కరణ్ జోహార్, అనన్యా పాండే, విజయ్ దేవరకొండ, ఛార్మి, పూరీజగన్నాధ్... ఇలా చిత్రబృందమంతా ఒక్కొక్కరూ టైసన్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతారు. అంతేకాక లైగర్ షూటింగ్ ను కూడా చూపిస్తారు. చాలా రోజుల తర్వాత లైగర్ మూవీ నుండి ఒక బిగ్ అప్డేట్ రావడంతో, అభిమానులు ఈ వీడియోను ఒకటికి రెండు సార్లు చూస్తున్నారు.