జగపతి బాబు, శరత్ కుమార్, నవీన్ చంద్ర, ఇషాన్, ఆకాంక్ష ప్రధాన పాత్రల్లో నటించిన 'పరంపర' వెబ్ సిరీస్ సీజన్-1 హిట్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ కి సంబంధించి సీజన్-2 రాబోతోంది. సీజన్-2 టీజర్ ను గురువారం విడుదల చేశారు. జూలై 21 నుంచి సీజన్-2 డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించిన ఈ సిరీస్ కు కృష్ణ విజయ్, విశ్వనాథ్ దర్శకత్వం వహించారు.