బాలీవుడ్ నటి షెనాజ్ ట్రెజరీ అరుదైనా వ్యాధితో బాధపడుతుంది. తను ప్రోసోపాగ్నోసియా అనే వ్యాధితో బాధపడుతున్నట్లు షెనాజ్ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఈ వ్యాధి ఉన్న వ్యక్తులు ఇతరుల ముఖాలను సరిగ్గా గుర్తుపట్టలేరని, ఈ వ్యాధి మూలంగా చాలామందిని దూరంగా చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొందని ఆమె పోస్టులో తెలిపింది. షెనాజ్ ‘ఇష్క్ విష్క్’, ‘ఢిల్లీ బెల్లీ’ వంటి చిత్రాలతో బాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకుంది.