నాగచైతన్య హీరోగా నటిస్తున్న చిత్రం శైలజారెడ్డి అల్లుడు. ఇందులో శైలజారెడ్డిగా సీనియర్ నటి రమ్యకృష్ణ, అల్లుడుగా నాగచైతన్య నటిస్తున్నారు. కమర్షియల్ అంశాలతో దర్శకుడు మారుతి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అను ఇమ్మాన్యుయేల్ నాయిక. ఈ మూవీ షూటింగ్ పూర్తి అయింది..ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్నది.. ఈ మూవీని వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 13వ తేదిన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.. వాస్తవానికి ఈ మూవీ 31వ తేదిన విడుదల కావలసి ఉంది.. కేరళలో వరదల కారణంగా ఈ మూవీలో పని చేస్తున్న పలువురు కేరళ వాసులు కావడంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులకు అంతరాయం కలిగింది.. దీంతో ఈ మూవీ రిలీజ్ ను వాయిదా వేసి కొత్త తేదిని చిత్ర యూనిట్ ప్రకటించింది.సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ మూవీకి నాగ వంశీ సుందర్ నిర్మాత..ఇక తాజాగా ఈ మూవీలోని ఎగిరెగిరా సాంగ్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. కృష్ణ కాంత్ రాసిన ఈ గీతాన్ని సిద్ శ్రీరామ్, లిప్పికలు ఆలపించారు.. గోపీ సుందర్ సంగీతం సమకూర్చాడు..తాజాగా విడుదలైన ఈ సాంగ్ ను మీరూ వినండి
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa