టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరోలలో శ్రీవిష్ణు ఒకరు. కెరీర్ మొదటి నుండి విభిన్నతకు పెద్దపీట వేస్తూ శ్రీవిష్ణు చేసిన సినిమాలన్ని ఆయనకు మంచి పేరును తీసుకొచ్చాయి. ఇటీవలే "భళా తందనాన" సినిమాతో రొటీన్ కాపీ కొట్టుడు సినిమా తీసాడని శ్రీవిష్ణు పై తొలిసారి విమర్శల వెల్లువలు వెల్లువెత్తాయి. కెరీర్లో మరో ప్రయోగానికి తెరదించుతూ శ్రీవిష్ణు నటిస్తున్న కొత్త సినిమా "అల్లూరి".
ప్రదీప్ వర్మ డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమాలో పవర్ పోలీసాఫీసర్ పాత్రలో శ్రీవిష్ణు మేకోవర్ కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. తాజాగా రిలీజైన టీజర్ తో ఈ విషయం ఇంకా స్పష్టమవుతుంది. ఎక్కడి దొంగలు అక్కడే గప్ చుప్... పోలీస్ బయల్దేరాడ్రా ... అనే డైలాగుతో ప్రారంభమైన ఈ టీజర్ లో డైలాగ్స్ ఇంకేవి ఉండవు. ఓన్లీ ఎమోషన్ అండ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్. ఇవే టీజర్ మొత్తాన్ని చాలా ఇంటరెస్టింగ్ గా నడిపించాయి. ఆఖరిలో శ్రీవిష్ణు చెప్పే "అల్లూరి సీతారామరాజు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ " అనే డైలాగ్ గూజ్ బంప్స్ తెప్పించే విధంగా ఉంది. మొత్తానికి టీజర్ తో "అల్లూరి" పై మంచి వైబ్స్ ను క్రియేట్ చేసారు చిత్రబృందం. ఇక, మున్ముందు ఈ సినిమా నుండి వచ్చే ప్రమోషనల్ కంటెంట్ ఇంకెంత పవర్ఫుల్ గా ఉంటుందో అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ చిత్రాన్ని లక్కీ మీడియా పతాకంపై బెక్కం వేణుగోపాల్ నిర్మిస్తున్నారు. ఇందులో కయదు లోహర్ హీరోయిన్ కాగా, హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు.