కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న 'బింబిసార' సినిమా ట్రైలర్ ను నేడు సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నారు. వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు చిరంతన్ భట్ మ్యూజిక్ అందిస్తున్నారు. చోటా కె నాయుడు కెమెరా మెన్ గా పనిచేస్తున్నారు. ఈ సినిమా ఆగష్టు 5న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాలో సంయుక్త మీనన్, కేథరిన్ నటిస్తున్నారు.