"సాహసం శ్వాసగా సాగిపో" మూవీ నుంచి 'వెళ్లిపోమాకే' సాంగ్ లిరిక్స్:
కాలం నేడిలా మారెనే
పరుగులు తిసేనే
హృదయం వేగం వీడదే
వెతికే చెలిమే నీడై నన్ను చేరితే
కన్నుల్లో నీవేగా నిలువెల్లా
స్నేహంగా తోడున్నా నీవే
ఇక గుండెలో ఇల్లా
నడిచే క్షణమే ఎదసడి ఆగే
ఉపిరి పాడే పెదవిని వీడే
పదమొక కవితై
మది నీ వశమై… నువు నా సగమై
ఎదలో తొలిప్రేమే కడలై ఎగిసే వేళా
పసివాడై కెరటాలే ఈ క్షణం… చూడన, చుడనా
ఎగిరే నింగి దాక ఊహల్నే
రెక్కల్లా చేసిందే ఈ భావం
ఓ..! కాలాన్నే కాజేసే కళ్ళ కౌగిల్లో
కరిగే… కలలేవో, ఓ ఓ
వెన్నెల్లో వేదించే… వెండి వానల్లో వెలిగే మనమే
మౌనంగా లోలోనే… కావ్యంగా మారే కలే
పన్నీటి జల్లై… ప్రాణమే తాకే
ఉపిరే పోసే… ఇది తొలి ప్రణయం (తొలి ప్రణయం)
మనం ఆపినా ఆగదే… ఎన్నడు వీడదే
వెళ్లిపోమాకే ఎదనే… వదిలేళ్లి పోమాకే
మనసే మరువై… నడవాలి ఎందాకే
వెళ్లిపోమాకే ఎదనే వదిలేళ్లి పోమాకే
మనసే మరువై… నడవాలి ఎందాకే
భాషే తెలియందే
లిపి లేదే కనుచూపే చాలందే
లోకాలంతమైన నిలిచేలా
మన ప్రేమే ఉంటుందే, ఇది వరమే
ఓ ఓఓ ఓఓ… ఓఓ ఓఓ ఓఓ
మనసుని తరిమే… చెలిమొక వరమే
మురిసిన పెదవుల సడి తెలిపే స్వరమే
ప్రణయపు కిరణం ఎదకిది అరుణం
కనులకి కనులని… ఎర వేసిన తొలి తరుణం
మది నదిలో ప్రేమే మెరిసే
ఏ అనుమతి అడగక కురిసే
నీలో నాలో హృదయం ఒకటై పాడే
కలలిక కనులని వీడవే
మనసిక పరుగే ఆపదే
మనసిక పరుగే ఆపదే
నీలో నాలో… నీలో నాలో
నీలో నాలో
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa