అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో కోలీవుడ్ వర్సటైల్ యాక్టర్ చియాన్ విక్రమ్ తన తదుపరి యాక్షన్ థ్రిల్లర్ సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'కోబ్రా' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమాలో విక్రమ్‌కు జోడీగా శ్రీనిధి శెట్టి నటిస్తోంది. ఈ సినిమాలో ఇర్ఫాన్ పఠాన్, రోషన్ మాథ్యూ, మియా జార్జ్, మృణాళిని రవి, కెఎస్ రవి కుమార్ తదితరులు కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్ట్ 11, 2022న ప్రేక్షకుల ముందుకు రానుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, కోబ్రా సినిమా తెలుగు వెర్షన్ రైట్స్ ని NVR సినిమా సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఎఆర్ రెహమాన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.