తెలుగు డైరెక్టర్ హను రాఘవపూడి డైరెక్షన్ లో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తున్న చిత్రం "సీతారామం". 1965 లో జరిగిన ఒక యుద్ధం బ్యాక్ డ్రాప్ లో నడిచే అందమైన ప్రేమకథను ఈ సినిమాలో చూపించనున్నారు. ఇందులో బాలీవుడ్ యంగ్ ట్యాలెంట్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ కాగా, నేషనల్ క్రష్ రష్మిక మండన్నా ఒక కీలకపాత్రలో నటిస్తుంది.
ఇటీవల విడుదలైన టీజర్, ఫస్ట్ లిరికల్ సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోగా, తాజాగా సీతారామం మేకర్స్ సెకండ్ సింగిల్ ను రిలీజ్ చేసారు. ఇంతందం దారితప్పిందా ... అని సాగే ఈ పాటకు కృష్ణకాంత్ సాహిత్యం అందించగా, SPB చరణ్ అద్భుతంగా ఆలపించారు. ఈ ప్రేమ గీతంలో దుల్కర్, మృణాల్ ల మధ్య కెమిస్ట్రీ వెండితెరపై అద్భుతమైన మ్యాజిక్ ను క్రియేట్ చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
స్వప్న సినిమాస్, వైజయంతి మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు.