హీరో విశాల్ 'లాఠీ' అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా క్లైమాక్స్ సీన్స్ చిత్రీకరిస్తుండగా నిన్న ప్రమాదం జరిగింది. ప్రమాదంలో విశాల్ కాలికి బలమైన గాయమైంది. దీంతో చిత్ర యూనిట్ సినిమా షూటింగ్‌ను ఆపేసింది. గతంలో కూడా హైదరాబాద్‌లో ఇదే సినిమా చిత్రీకరణ సమయంలో విశాల్ చేతికి, చేతి వేళ్లకు గాయాలు కావడం విశేషం. ప్రస్తుతం విశాల్ చికిత్స తీసుకుంటున్నాడు. పూర్తిగా కోలుకోవడానికి కొన్నిరోజుల టైం పట్టనుంది.