`ఆర్‌ఆర్‌ఆర్` భామ అలియాభట్ ఇప్పుడు బాలీవుడ్‌లో హాట్ టాపిక్. ఆమె ఇటీవల ప్రెగ్నెన్సీని ప్రకటించిన నేపథ్యంలో అది వైరల్ అయ్యింది. దాన్నుంచి పెద్ద చర్చ నడిచింది. అలియాభట్ ఆరు రోజుల క్రితం ప్రెగ్నెన్సీని ప్రకటించి అభిమానులను సర్‌ప్రైజ్ చేసింది. సడెన్‌గా అలియా ప్రెగ్నెంట్ అనే వార్తలు షాక్‌తో కూడిన సర్‌ప్రైజ్ కావడం విశేషం. ఎవరూ ఊహించలేదు. రెండు నెలల క్రితమే వివాహం చేసుకున్న ఈ జంట అప్పుడే పిల్లలు కనాలనుకోవడం ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే ఈ విషయంపై కొంత వివాదం కూడా నడిచింది. దానికి అలియా సైతం ఘాటుగానే స్పందించింది
ఇక ఇప్పుడు గ్లామర్ ఫోటోలతో కట్టిపడేస్తుంది అలియాభట్. ప్రెగ్నెన్సీని ప్రకటించిన తర్వాత ఫస్ట్ టైమ్ చేసిన ఫోటో షూట్ పిక్స్ ని పంచుకుంది. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో షేర్ చేసింది. ఇందులో రావిషింగ్ లుక్‌లో కట్టిపడేసేలా ఉంది అలియాభట్.
![]() |
![]() |