సౌత్ నుండి నార్త్ కి వెళ్లి, అగ్ర కధానాయికగా ఎదిగిన హీరోయిన్లలో తాప్సి ఒకరు. బాలీవుడ్లో పలు ఫిమేల్ సెంట్రిక్ సినిమాలలో లీడ్ రోల్స్ లో నటించిన తాప్సి ఆపై ఔట్ సైడర్స్ అనే నిర్మాణసంస్థను స్థాపించి చిన్న బడ్జెట్ సినిమాలను నిర్మిస్తుంది.
తాప్సి నిర్మాణ సారధ్యంలో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ సమంత బాలీవుడ్ డిబట్ చేస్తుందని ఎప్పటినుండో పుకార్లు వినిపిస్తుండగా, తాజాగా ఈ వార్తలపై తాప్సి స్వయంగా క్లారిటీ ఇచ్చింది. తన సొంత బ్యానర్ ఔట్ సైడర్స్ నిర్మాణసంస్థలో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ సమంత బాలీవుడ్ కి డిబట్ ఎంట్రీ ఇవ్వడం ఖాయమని, అందులో తాను ఎలాంటి రోల్ ను పోషించబోవడం లేదని తాప్సి తెలిపింది. తాను నిర్మించబోయే సినిమాలో సమంతది చాలా పవర్ఫుల్ రోల్ అని, ఆ పాత్రకు సమంత కరెక్ట్ ఛాయస్ అని చెప్పింది. త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడబోతుందని చెప్పారు.