ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రామ్ "ది వారియర్" తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ డీటెయిల్స్..

cinema |  Suryaa Desk  | Published : Wed, Jul 06, 2022, 10:30 AM

టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని కెరీర్లో తొలిసారి పవర్ఫుల్ పోలీసాఫీసర్ గా నటిస్తున్న చిత్రం "ది వారియర్". కోలీవుడ్ డైరెక్టర్ ఎన్. లింగుసామి డైరెక్షన్లో యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కృతిశెట్టి, అక్షర గౌడ హీరోయిన్లుగా నటిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా జూలై 14న థియేటర్లలో ఈ సినిమా విడుదల కాబోతుంది.
ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీ తమిళ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించి మేకర్స్ నిన్న అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేయగా, తాజాగా తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ జూలై 10వ తేదీన హైదరాబాద్ లోని JRC కన్వెన్షన్స్ లో జరగబోతుందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. త్వరలోనే ఈ విషయమై మేకర్స్ అధికారిక ప్రకటన చెయ్యనున్నారు. పోతే.., ఈ రోజు సాయంత్రం చెన్నైలోని సత్యం థియేటర్లో వారియర్ తమిళ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది. ఈ ఈవెంట్కు 28మంది కోలీవుడ్ సినీ సెలెబ్రిటీలు హాజరుకాబోతున్నారు.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com