కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తొలిసారి తెలుగులో నటిస్తున్న చిత్రం "సర్". తొలిప్రేమ, మిస్టర్ మజ్ను వంటి డిఫరెంట్ లవ్ స్టోరీలను తెరకెక్కించిన వెంకీ అట్లూరి ఈ సినిమాకు దర్శకుడు. ఇందులో సంయుక్త మీనన్ హీరోయిన్ కాగా, GV ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.
తెలుగుతో పాటు ఒకేసారి తమిళంలో కూడా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవర్ఫుల్ విలన్ పాత్రలో డైలాగ్ కింగ్ సాయికుమార్ నటించబోతున్నట్టు టాక్. ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయికుమార్ ఈ విషయంపై స్వయంగా స్పందించారు. ధనుష్ 'సర్' సినిమాలో తాను విలన్గా నటించబోతున్నట్టు తెలిపారు. ఇందుకు సంబంధించిన మిగిలిన విషయాలను సాయికుమార్ వెల్లడించలేదు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీని సితార ఎంటెర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.