మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన కొత్త చిత్రం "గని". కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో జగపతి బాబు, కన్నడ స్టార్ ఉపేంద్ర, సునీల్ శెట్టి, నవీన్ చంద్ర కీలకపాత్రల్లో నటించారు.తమన్నా ప్రత్యేక గీతంతో అలరించింది. బాలీవుడ్ నటి సయీ మంజ్రేకర్ కధానాయికగా నటించిన ఈ చిత్రానికి ఎస్. తమన్ సంగీతం అందించారు. అల్లు వారసుడు అల్లు బాబీ తొలిసారి నిర్మాణ బాధ్యతలు చేపట్టి నిర్మించిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో పూర్తిగా విఫలమైంది.
బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. దీంతో కొన్ని రోజుల వ్యవధిలోనే ఓటిటిలో సందడి చేసిన గని తాజాగా బుల్లితెరపై ఫస్ట్ పంచ్ ఇవ్వడానికి రెడీ అవుతుంది. జెమినీ ఛానెల్ లో జూలై 10వ తేదీన సాయంత్రం ఆరు గంటలకు గని సినిమా టెలికాస్ట్ అవ్వనుంది.