బాహుబలి 1, 2 తో డార్లింగ్ ప్రభాస్ రేంజ్ ఒక్కసారిగా తారాస్థాయికి చేరిన విషయం అందరికి తెలిసిందే. బాహుబలి నుండి ఒక్కో సినిమాకు కోట్లల్లో పారితోషికాలు అందుకుంటున్న ప్రభాస్, ఆ డబ్బును వ్యాపారరంగంలో పెట్టుబడిగా పెట్టబోతున్నాడట.
టాలీవుడ్ సీనియర్ హీరోలైన మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, సూపర్ స్టార్ మహేష్ బాబు తరహాలోనే ప్రభాస్ కూడా తన డబ్బును బిజినెస్ లో ఇన్వెస్ట్ చేయబోతున్నాడని టాక్. అదికూడా కరోనా కాలంలో బాగా నష్టపోయిన హోటల్ బిజినెస్ లో అంట. దుబాయ్, స్పెయిన్ వంటి ఇంటెర్నేషనల్ దేశాలలో ప్రారంభమవబోతున్న ఈ హోటల్ ప్రాజెక్టులలో ప్రభాస్ మైనర్ స్టేక్ హోల్డర్ గా ఉండబోతున్నాడట. కరోనా తర్వాత ఇప్పుడిప్పుడే అభివృద్ధి లోకి వచ్చిన హోటల్ బిజినెస్ రంగంలో ప్రభాస్ వంటి స్టార్ హీరో పెట్టుబడులు పెట్టడం ఆయనకు ఎంతవరకు లాభాలనిస్తుందో చూడాలి మరి.