టాలీవుడ్ మాస్ రాజా రవితేజ నటిస్తున్న కొత్త చిత్రం రామారావు ఆన్ డ్యూటీ. శరత్ మండవ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో మజిలీ ఫేమ్ దివ్యాన్ష కౌశిక్, రజీషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్, RT టీం వర్క్స్ బ్యానర్ లపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రం జూలై 29న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటివరకు విడుదలైన పోస్టర్లు, లిరికల్ సాంగ్స్ ప్రేక్షకుల్లో పాజిటివ్ వైబ్స్ ను క్రియేట్ చేసాయి.
తాజాగా రామారావు ఆన్ డ్యూటీ మేకర్స్ బిగ్ ఎనౌన్స్మెంట్ చేసారు. అదేంటంటే, ఈ సినిమాతో చాలాకాలం తర్వాత టాలీవుడ్ కి రీఎంట్రీ ఇస్తున్న వేణు తొట్టెంపూడి క్యారెక్టర్ పోస్టర్ ను ఈరోజు సాయంత్రం 4:05 నిమిషాలకు విడుదల చెయ్యబోతున్నట్టు మేకర్స్ అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేసారు.