"పుష్ప" పాన్ ఇండియా గ్రాండ్ సక్సెస్ తో ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ వరస వెకేషన్ లకు వెళ్తున్నాడని, ఆరు నెలల్లో మూడు ఫారిన్ ట్రిప్పులకెళ్ళొచ్చిన బన్నీ తాజాగా టాంజానియా విహారయాత్రకు వెళ్లాడని మీడియాలో ఒక రేంజులో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. టాంజానియాలో ప్రసిద్ధి పొందిన సెరెంగెటి నేషనల్ పార్క్ ను బన్నీ అండ్ ఫ్యామిలీ సందర్శించిన ఫోటోను స్నేహారెడ్డి తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయగా అది, తెగ వైరల్ అయ్యింది.
ఐతే, కొంతమంది మాత్రం బన్నీ కేవలం వెకేషన్ కోసమే కాదు... మరొక ప్లాన్ తోనే టాంజానియా కి వెళ్లాడని అంటున్నారు. అదేంటంటే, పుష్ప 2 షూటింగ్ లొకేషన్స్ కోసం దర్శకనిర్మాతలు ఎప్పటినుండో దేశవిదేశాలలోని ప్రఖ్యాత ప్రదేశాలను గాలిస్తున్నారు. టాంజానియా వెకేషన్ కెళ్లిన బన్నీ అక్కడ అన్ని ప్రదేశాలను సందర్శించి, పుష్ప 2 మేకింగ్ కు కరెక్ట్ గా సరిపోయే లొకేషన్స్ ఏవైనా తారసపడితే, వాటిని దర్శకనిర్మాతలకు చూపించే ఉద్దేశంతో ఉన్నాడంట. ఏదిఏమైనా,, ఐకాన్ స్టార్ నిజంగా ఐకాన్ స్టారే. ఒకేసారి వెకేషన్ చేసినట్టుంటుంది అలానే పుష్ప2 కి సంబంధించిన పని కూడా కానిచ్ఛేసినట్టుందని "టాంజానియా వెకేషన్"తో సూపర్ ప్లాన్ వేసాడు.