ఫిమేల్ డైరెక్టర్ సుధా కొంగర డైరెక్షన్లో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, అపర్ణ బాలమురళి జంటగా నటించిన చిత్రం "సురారై పొట్రు"(తెలుగులో "ఆకాశమే నీ హద్దురా"). మంచి కరోనా టైం లో డైరెక్ట్ ఓటిటిలో రిలీజైన ఈ సినిమా సూపర్ సక్సెస్ అయ్యింది. విడుదలై రెండు సంవత్సరాలు కావొస్తున్నప్పటికీ ఈ సినిమా సృష్టించే రికార్డుల పర్వం ఇంకా ఆగకపోవడం విశేషం. పలు ఇంటెర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ లో ప్రదర్శితమైన ఈ సినిమా మనదేశం నుండి ఆస్కార్ అవార్డుల స్క్రీనింగ్ కు కూడా ఎన్నికై చివరాఖరిలో వెనుదిరిగింది.
తాజాగా ఈ సినిమా ఉమెన్స్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ (WIFF) మూడవ ఎడిషన్ కు అఫీషియల్ గా సెలెక్ట్ అయ్యింది. కేరళలో జరగబోయే ఈ ఫెస్టివల్ లో జూలై 18వ తేదీన సురారై పొట్రు ను స్క్రీనింగ్ చెయ్యనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా సూర్య సొంత నిర్మాణ సంస్థ ఐన 2D ఎంటర్టైన్మెంట్స్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది.
పోతే..., సురారై పొట్రు సినిమాను సుధా కొంగర హిందీలో కూడా రీమేక్ చేస్తున్నారు. హిందీలో అక్షయ్ కుమార్ లీడ్ రోల్ లో నటిస్తున్నారు. ఈ సినిమాకు సూర్య కో-ప్రొడ్యూసర్ గా వ్యవహరించడమే కాక, గెస్ట్ అప్పియరెన్స్ కూడా ఇస్తున్నారు.