ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి జిల్లా శ్రీకాళహస్తికి చెందిన జనార్దన్ అనే వ్యక్తి ఎన్టీఆర్‌కు వీరాభిమాని. అయితే ఓ రోడ్డు ప్రమాదంలో జనార్దన్ గాయపడి ఆసుపత్రలో కోమాలో ఉన్న విషయం తెలిసిందే. ఈ విషయం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ ద్వారా ఎన్టీఆర్ దృష్టికి వెళ్లింది. జనార్ధన్ తల్లితో ఎన్టీఆర్ మాట్లాడి ఆమెకు ధైర్యం చెప్పారు. అయితే జనార్దన్ మంగళవారం సాయంత్రం తుది శ్వాస విడిచారు.దీంతో జనార్ధన్ కుటుంబంలో విషాదం నెలకొంది.