కన్నడ నటుడు కిరణ్ రాజ్ హీరోగా నటిస్తున్న సినిమా 'విక్రమ్ గౌడ్'. ఈ సినిమాకి పాసం నరసింహారావు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో దీపికా సింగ్ హీరోయిన్‌గా నటిస్తుంది. జూలై 5న కిరణ్ రాజ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన కొత్త పోస్టర్‌ను చిత్ర బృందం రిలీజ్ చేశారు. ఈ సినిమాలో పోసాని కృష్ణ మురళి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా తెలుగు, కన్నడ భాషల్లో రూపొందుతోంది.