తమిళ నటి ఐశ్వర్య రాజేష్ నటించిన 'డ్రైవర్ జమున' సినిమా ట్రైలర్ నేడు విడుదల కానుంది. తెలుగు ట్రైలర్ ను టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు సాయంత్రం 5:15 గంటలకు విడుదల చేయనున్నారు. పి.కిన్ స్లిన్ డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు జిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా 18 రీల్స్ బ్యానర్ పై రూపొందింది. ఐశ్వర్య రాజేష్ పలు డబ్బింగ్ సినిమాలతో తెలుగులో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది.