కోలీవుడ్ స్టార్ హీరో శింబు తండ్రి, డైరెక్టర్ టి. రాజేందర్ ఇటీవల ఆకస్మిక గుండె నొప్పితో ఆసుపత్రి పాలైన విషయం తెలిసిందే. మెడికల్ చెకప్ లో భాగంగా ఆయన కడుపులో రక్త స్రావాన్ని డాక్టర్లు గుర్తించారని, ఇందుకోసం మెరుగైన చికిత్స అవసరమని డాక్టర్లు సూచించారని, చికిత్స కోసం త్వరలోనే రాజేందర్ విదేశాలకు వెళ్లనున్నారని గతంలోనే శింబు ఒక అధికారిక ప్రకటన చేసారు. ఆ తర్వాత రాజేందర్ ను శింబు ఆయన కుటుంబసభ్యులు కలిసి అమెరికాకు తీసుకువెళ్లి చికిత్స ఇప్పిస్తున్నారు. తాజాగా అమెరికాలో చికిత్స పొందుతున్న రాజేందర్ పూర్తిగా కోలుకున్నారని, ఒక నెల రోజులపాటు అక్కడే డాక్టర్ల సమక్షంలో ఉండి విశ్రాంతి తీసుకుంటారని తెలుస్తుంది. తండ్రికి చికిత్స పూర్తయిన వెంటనే శింబు ఇండియాకు తిరిగొచ్చి, వర్క్ కమిట్మెంట్స్ ను పూర్తి చేసే పనిలో తలమునకలయ్యారు.