తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, నటుడు నందమూరి హరికృష్ణ అకాల మరణం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ వార్త విని తెలుగు సనీ పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ షాక్‌తో సినీ లోకమంతా విషాద ఛాయలు నెలకొన్నాయి. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. సీనియర్, జూనియర్ నటులంతా సోషల్ మీడియా ఖాతాల ద్వారా హరికృష్ణ మృతి పెద్ద ఎత్తున సంతాప సందేశాలు పంపుతూ.. హరికృష్ణ తనయులు ఎన్టీయార్, కల్యాణ్ రామ్‌లకు సానుభూతి తెలియజేస్తున్నారు.
తాజాగా హీరోయిన్ తమన్నా తన సంతాపాన్ని తెలియజేసింది. ‘నందమూరి హరికృష్ణ గారి మరణ వార్త వినగానే గుండె పగిలిపోయింది. ఆయన కుటుంబ సభ్యులకు, కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్‌లకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఈ బాధాకర పరిస్థితి నుంచి బయటకు వచ్చి మీరంతా ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నా’ అని ట్వీట్ చేసింది తమన్నా.
Heartbroken by the news of the demise of Nandamuri Harikrishna garu, extending my condolences to the family @NANDAMURIKALYAN & @tarak9999 , may they find the courage to deal with this loss.
— Tamannaah Bhatia (@tamannaahspeaks) August 29, 2018
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa