బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ సౌత్ డైరెక్టర్ అట్లీతో ఒక సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసందే. ఈ మూవీలో షారూఖ్ ఖాన్ సరసన జోడిగా లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తుంది. ఈ చిత్రానికి 'జవాన్' అనే టైటిల్ ను మూవీ మేకర్స్ లాక్ చేసారు. లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం, ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి విలన్‌గా నటించనున్నాడని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ పాన్-ఇండియా ప్రాజెక్ట్‌లో సన్యా మల్హోత్రా అండ్ సునీల్ గ్రోవర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు మూవీ మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.