దర్శకుడు తేజ తనయుడు అమిటోవ్ తేజ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. 'విక్రమాదిత్య' పేరుతో తేజ వారసుడి ఎంట్రీ జరగబోతోంది. దీనికి తేజనే దర్శకుడు. ఈ సినిమాకి రూ.30 కోట్ల బడ్జెట్ అని తెలుస్తోంది. తేజ కెరీర్ లో భారీ బడ్జెట్ చిత్రమిదే. వాస్తవానికి తేజ సినిమాలు చాలా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కుతుంటాయి. అప్పట్లో 'చిత్రం' సినిమాని రూ. 30 లక్షల్లో తీసేశారు. 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాకి రూ. 15 కోట్లు ఖర్చయింది. ఇప్పుడు కొడుకు సినిమా కోసం ఏకంగా రూ. 30 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ప్రీ ఇండిపెండెన్స్ నేపథ్యంలో జరిగే కథ ఇది. ఆ వాతావరణం సృష్టించడానికి సెట్లు వేయాల్సిందే. కాబట్టి.. ఖర్చు పెరుగుతోంది. తరలలోనే ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లారు.