యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, 'కలర్ ఫోటో' ఫేమ్ చాందిని చౌదరి జంటగా నటించిన చిత్రం సమ్మతమే. ఈ సినిమాతో గోపినాధ్ రెడ్డి డైరెక్టర్ గా పరిచయమవబోతున్నారు. యూ జి ప్రొడక్షన్స్ బ్యానర్ పై కంకణాల ప్రవీణ్ నిర్మించిన ఈ చిత్రం జూన్ 24న విడుదలై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ప్రఖ్యాత టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ ఈ మూవీని సొంతంగా డిస్ట్రిబ్యూట్ చేసారు. గీతా ఆర్ట్స్, అల్లుఅరవింద్ ఇమేజ్ ఈ సినిమాకు విజయాన్ని కట్టబెట్టడంలో పూర్తిగా విఫలమయ్యాయి.
దీంతో మేకర్స్ సమ్మతమే సినిమాను డిజిటల్ స్ట్రీమింగ్ కు తీసుకొచ్చే ఆలోచన చేస్తున్నారు. ఈ మేరకు జూలై 15వ తేది నుండి తెలుగు ఓటిటి ఆహా లో సమ్మతమే స్ట్రీమింగ్ కానున్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. డిజిటల్ లో ఈ సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి మరి.