క్రియేటివ్ డైరెక్టర్ మణిరత్నం డైరెక్షన్లో చియాన్ విక్రమ్,ఐశ్వర్యా రాయ్ రెండోసారి జతకట్టిన చిత్రం "పొన్నియిన్ సెల్వన్". హిస్టారికల్ ఫిక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మణిరత్నం కో ప్రొడ్యూసరుగా కూడా వ్యవహరిస్తున్నారు. కార్తీ, జయం రవి, త్రిష ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మణిరత్నం డ్రీం ప్రాజెక్ట్ గా పేర్కొనబడుతున్న ఈ మూవీ సెప్టెంబర్ 30వ తేదీన విడుదల కావడానికి రెడీ అవుతుంది.
వారం రోజుల నుండి ఈ మూవీకి సంబంధించిన మెయిన్ క్యాస్ట్ ఫస్ట్ లుక్ పోస్టర్లను విడుదల చేస్తూ, అభిమానుల్లో అంచనాలను పెంచేసిన మేకర్స్ తాజాగా ఈ మూవీలో సెకండ్ ఫిమేల్ లీడ్ రోల్ పోషిస్తున్న హీరోయిన్ త్రిష ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. పురుషాధిక్య రాజ్యంలో ధైర్యశాలి గా పేరుపొందిన...యువరాణి "కుందవై" అని పేర్కొంటూ మేకర్స్ త్రిష ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసారు.