కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ ఇటీవల కరోనాకు గురై ఈ మధ్యే కోలుకున్నారు. తాజాగా ఈ రోజు ఉదయం ఆయనకు తీవ్ర జ్వరం రావడంతో, వైద్యుల సూచన మేరకు హాస్పిటల్ లో చేరారు. సన్నిహిత వర్గాల సమాచారం మేరకు ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నట్టు తెలుస్తుంది. త్వరలోనే పూర్తి ఆరోగ్యంగా ఆసుపత్రి నుండి డిశ్చార్జయి అభిమానులను పలకరిస్తారని చెప్పారు. ఆకస్మికంగా విక్రమ్ హాస్పిటల్ లో జాయిన్ అవ్వడంతో మీడియాలో పలురకాల వార్తలు జోరుగా ప్రచారం అవుతున్నాయి. వాటిలో నిజం లేదని, త్వరలోనే విక్రమ్ ఆరోగ్యంగా మారి సినిమాల్లో నటిస్తారని తెలిపారు.
విక్రమ్ "కోబ్రా" అనే సినిమాలో నటిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి ఆర్. జ్ఞానముత్తు దర్శకత్వం వహిస్తున్నారు. ఆగస్టు 11న విడుదలబోతున్న ఈ చిత్రానికి ఏ. ఆర్. రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు. సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్ పై లలిత్ కుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో కేజీఎఫ్ భామ శ్రీనిధిశెట్టి హీరోయిన్. మాజీ ఇండియన్ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక పాత్ర పోషిస్తున్నారు.