టాలీవుడ్ క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ డైరెక్ట్ చెయ్యబోతున్న 21 వ సినిమాకు సంబంధించి ఇటీవలే అధికారిక ప్రకటన జరిగింది. సినిమాను అఫీషియల్గా ఎనౌన్స్ చేస్తూ విడుదల చేసిన వీడియో ఈ సినిమాపై పాజిటివ్ వైబ్స్ ను క్రియేట్ చేసింది.
నిన్న సాయంత్రం ఈ సినిమాలో నటించే కీలక పాత్రధారులు, సాంకేతిక నిపుణుల గురించి పేర్కొంటూ, మరొక కొత్త వీడియోను విడుదల చేసారు. ముఖ్యంగా ఈ వీడియోలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. మన అమ్మానాన్నల కథ అనే శీర్షికతో స్టార్ట్ ఐన ఈ వీడియోలో మ్యూజిక్ డైరెక్టర్ గా ఇళయరాజా పేరును, కీలక పాత్రల్లో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, హాస్యబ్రహ్మ బ్రహ్మానందం, బహుముఖ నటి రమ్యకృష్ణ నటించబోతున్నట్టు పేర్కొన్నారు.
తాజాగా ఈ మూవీ టైటిల్ లోగోను విడుదల చేసారు. గతంలో వచ్చిన పుకార్ల ప్రకారమే, ఈ సినిమాకు "రంగమార్తాండ" అనే ఇంటరెస్టింగ్ టైటిల్ ను ఖరారు చేసారు. లేట్ లెజెండ్ సిరివెన్నెల సీతారామశాస్త్రి ఈ సినిమాలోని గీతాలకు సాహిత్యమందించారు.