శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో టాలెంటెడ్ హీరో అడివి శేష్ నటించిన "మేజర్" సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఈ చిత్రంలో భితా ధూళిపాళ, సాయి మంజ్రేకర్, ప్రకాష్ రాజ్, రేవతి సహాయక పాత్రల్లో కనిపించనున్నారు. "మేజర్" చిత్రం భారతదేశంలోని ముంబైలో 26-11 మధ్య జరిగిన ఘోరమైన ఉగ్రవాద దాడులలో వీరమరణం పొందిన సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత ప్రయాణం ఆధారంగా రూపొందించబడింది. ఈ సినిమా జూలై 3, 2022 నుండి OTTప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్ లో ప్రసారం చేయడానికి అందుబాటులోకి వచ్చింది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా OTTలో విడుదలైన రెండవ రోజు నుండి నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ 2 స్థానాల్లో ట్రెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. హిందీ వెర్షన్ అగ్రస్థానంలో ఉండగా, తెలుగు వెర్షన్ తర్వాతి స్థానంలో ఉన్నట్లు సమచారం. ఈ సినిమాకి GMB ఎంటర్టైన్మెంట్స్, సోనీ పిక్చర్స్ ఇండియా మరియు AplusS మూవీస్ బ్యానర్లు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa