టాలీవుడ్ యంగ్ హీరో, "మా" ప్రెసిడెంట్ మంచు విష్ణు "జిన్నా" అనే చిత్రంలో నటిస్తున్నారు. తెలుగుతో పాటు ఈ సినిమా తమిళం, మలయాళం, హిందీ భాషలలో కూడా విడుదలవబోతుంది. మురుగదాస్, శ్రీను వైట్ల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన ఇషాన్ సూర్య ఈ సినిమాకు డైరక్టర్ గా పని చేస్తున్నారు. ఇందులో పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్ హీరోయిన్లుగా నటిస్తుండగా, అనూప్ రూబెన్స్ సంగీతమందిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా నుండి మంచు విష్ణు ఫస్ట్ లుక్ ను జూలై 11వ తేదీ ఉదయం 10:22 కు విడుదల చెయ్యబోతున్నట్టు అధికారిక ప్రకటన వెలువడింది. ఈ మేరకు విడుదల చేసిన టీజర్, ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది. ప్రేమ్ రక్షిత్, గణేష్ ఆచార్య, ప్రభుదేవా వంటి స్టార్ కొరియోగ్రాఫర్లు ఈ సినిమాలోని పాటలకు స్టెప్పులనందిస్తున్నారు.