జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు పుట్టినరోజు సందర్భంగా యంగ్ హీరో రామ్ చరణ్ వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపాడు. బాబాయ్ కి అద్భుతమైన బహుమతిని అందించాడు. ఎంతో సాహసంతో కూడిన పారాగ్లైడింగ్ చేసి, దాన్ని తన బాబాయ్ కి పుట్టినరోజు సందర్భంగా అంకితం చేశాడు.ఈ వీడియోను ఆయన భార్య ఉపాసన తన సోషల్ మీడియా పేజ్ లో షేర్ చేశారు. ఈ సందర్భంగా, 'ప్రియమైన బాబాయ్, నా జీవితంలో కాని, సినిమాల్లో కాని సాహసాలు చేసే స్ఫూర్తిని, ధైర్యాన్ని నాకు మీరే ఇచ్చారు. ఈ సాహసం మీ కోసమే. కొందరి సాయంతో ఈ సాహసాన్ని చేశాను. పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీరు నాకు ఇస్తున్న స్ఫూర్తి ఇలాగే కొనసాగాలి' అంటూ ట్వీట్ చేశాడు.
Dearest babai , U’ve always inspired me to do daring things in life & films, this is for u - did it with some help the first time - have a great birthday & keep inspiring us. #HappyBirthdaypowerstar #HBDPSPK #RamCharan pic.twitter.com/KsqsHmavWd
— Upasana Kamineni (@upasanakonidela) September 2, 2018
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa