టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని, కోలీవుడ్ స్టార్ హీరో శింబు ఎప్పటినుండో మంచి స్నేహితులు. రామ్ రిక్వెస్ట్ మేరకు "ది వారియర్" లో బుల్లెట్ పాటను పాడాడు శింబు. ఆ పాట యూట్యూబులో క్రియేట్ చేస్తున్న సెన్సేషన్ అంతా ఇంతా కాదు. రీసెంట్గా 150 మిలియన్ల రికార్డు స్థాయి మార్కును కూడా అందుకుంది. తదుపరి తన తండ్రి చికిత్స నిమిత్తం అమెరికా వెళ్లిన శింబు, ఈ మధ్యనే ఇండియాకు తిరిగి వచ్చాడు.
జూలై 14న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కాబోతున్న ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా రామ్ కొన్ని కోలీవుడ్ మీడియా ఛానెల్స్ ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నాడు. ఈ క్రమంలో శింబును కలుసుకుని, ఆయన తండ్రి ఆరోగ్యం గురించి తెలుసుకున్నాడట రామ్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa