కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో విశ్వనటుడు కమల్ హాసన్ నటించిన చిత్రం "విక్రమ్". జూన్ 3న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. పక్కా యాక్షన్ థ్రిల్లర్ గా, పవర్ఫుల్ కంటెంట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. విక్రమ్ ను చూసిన చాలామంది సినీ సెలెబ్రిటీలు ప్రశంసల వర్షం కురిపిస్తూ, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.
తాజాగా ఈ లిస్టులోకి కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ కూడా చేరారు. విక్రమ్ సినిమాను చూసిన ప్రశాంత్ ఆ వెంటనే తన అభిప్రాయాన్ని ట్వీట్ రూపంలో తెలియచేసారు. కమల్, విజయ్, ఫాహద్ ...ముగ్గురిని ఒకే ఫ్రేమ్ లో చూడడం చాలా థ్రిల్లింగ్ గా ఉందని తెలిపారు. డైరెక్టర్ లోకేష్ పనితనానికి తాను ముందు నుండి అభిమానినని చెప్పారు. అనిరుద్ ను రాక్ స్టార్ గా అభివర్ణిస్తూ, సినిమాకు ఫైట్స్ కంపోజ్ చేసిన అంబు, అరివు లను మెచ్చుకుంటూ ట్వీట్ చేసారు.