బాలకృష్ణ కొత్త సినిమా NBK 107 కోసం గీత రచయిత రామజోగయ్య శాస్త్రి తెగ కష్టపడుతున్నట్టు తెలుస్తుంది. ఈ మేరకు తెల్లవారుఝామునే మేల్కొని బాలయ్య కోసం సూపర్ లిరిక్స్ సిద్ధం చేస్తున్న శాస్త్రి గారి ఫోటో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది. మిచిగాన్ లోని ట్రాయ్ లో బాలయ్య కోసం శాస్త్రిగారు పాటలు రాస్తున్నారు. ఈ ఫోటోను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసిన రామజోగయ్య శాస్త్రి # jaibalayya అని పేర్కొనడం విశేషం.
నిజానికి NBK 107 టైటిల్ ఇంకా అధికారికంగా ఖరారు కాలేదు. కానీ, ప్రచారంలో జైబాలయ్య అనే పేరు మాత్రం బలంగా వినిపిస్తుంది. ఇప్పుడు అదే పేరును గీత రచయిత రామజోగయ్య శాస్త్రి గారు కూడా ఉపయోగించడంతో, ఈ సినిమాకు జై బాలయ్య అనే పేరునే ఖరారు చేస్తారని క్లియర్ అయిపోయింది. పోతే.., ఈ చిత్రానికి గోపీచంద్ మలినేని దర్శకుడు కాగా, శ్రుతిహాసన్ హీరోయిన్. తమన్ సంగీత దర్శకుడు.