యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త చిత్రం "వినరో భాగ్యము విష్ణు కథ". గీత ఆర్ట్స్ 2 బ్యానర్లో అల్లు అరవింద్ నిర్మిస్తున్నఈ చిత్రంలో ఈ సినిమాలో కాశ్మీర హీరోయిన్ గా నటిస్తుండగా,మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నారు. చేతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు.
కొన్నిరోజులుగా రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ నుండి ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకు బిగ్ అప్డేట్ రాబోతుందని హీరో కిరణ్ అబ్బవరం తన అఫీషియల్ ట్విట్టర్ ఖాతా ద్వారా ఎనౌన్స్ చేసారు.