తమిళనాడులో పేరొందిన న్యూ శరవణ స్టోర్స్ అధినేత శరవణ సినీరంగ ప్రవేశం చెయ్యబోతున్నారు. "ది లెజెండ్" అనే సినిమాలో లీడ్ రోల్ లో నటించి ఆ సినిమాకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. JD జెర్రీ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రానికి హ్యారిస్ జయరాజ్ సంగీతమందించారు. ప్రభు, సుమన్, యోగిబాబు కీలకపాత్రలు పోషించారు. దాదాపు వంద కోట్ల బడ్జెట్టుతో తెరకెక్కిన ఈ మూవీ తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషలలో జూలై 28వ తేదీన విడుదల కాబోతుంది.
తాజాగా ఈ మూవీ తెలుగు హక్కులను ప్రముఖ టాలీవుడ్ నిర్మాణ సంస్థ శ్రీ లక్ష్మి మూవీస్ అధినేత తిరుపతి ప్రసాద్ చేజిక్కించుకున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలలో భారీ ఎత్తున ఈ సినిమా విడుదల కాబోతుంది. ముంబై బ్యూటీ ఊర్వశి రౌతెలా ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. కోలీవుడ్ కమెడియన్ వివేక్ ఆఖరిసారిగా నటించిన చిత్రమిదే.